శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా (అర్బన్) బీజేపీలో కొత్త డివిజన్ అధ్యక్షుల నియామకాలు జరిగాయి. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఎల్బీనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పలువురిని డివిజన్ అధ్యక్షులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 9 మందికి డివిజన్ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. జీఎస్ఐ (డివిజన్ 46)కి ఎర్ర వినోద్ రెడ్డి, లెక్చరర్స్ కాలనీ (47)కి ఏనుగు ప్రమోద్ కుమార్ రెడ్డి, హైకోర్టు కాలనీ (48)కి మర్రి మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. చింతల్‌కుంట (44)కు గణమనేని వాసు చౌదరి, సహేబ్‌నగర్ (49)కు గంగం ప్రేమ్‌నాథ్, హస్తినాపురం (41)కు పాశం జీవన్ రెడ్డి, బైరామల్‌గూడ (40)కు ఎరుకల మల్లేష్ గౌడ్, కర్మన్‌ఘాట్ (39)కు సద్ది సందీప్ రెడ్డి, లింగోజిగూడ (37)కు గుండె కిరణ్ కుమార్‌ను డివిజన్ అధ్యక్షులుగా నియమించారు.

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 15 డివిజన్లకు కొత్త అధ్యక్షులను నియమించారు. దీప్తిశ్రీనగర్ (239)కు అరవింద్, మక్తా మహబూబ్‌పేట్ (241)కు గుండె గణేష్ ముదిరాజు, నల్లగండ్ల (226)కు కిషన్ బౌలి, మసీద్ బండ (228)కు కరణ్ గౌడ్, శ్రీరామ్ నగర్ (229)కు అరుణ్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా కొండాపూర్ (234)కు శేరి నవీన్ రెడ్డి, అంజయ్య నగర్ (230)కు ముదావత్ రవి నాయక్, హైటెక్ సిటీ (231)కి ఉప్పలపాటి అరవింద్ చక్రవర్తి, మాదాపూర్ (232)కు కొండకల్ ఆనంద్ కుమార్, ఇజ్జత్ నగర్ (233)కు మండల రాజేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. మాతృశ్రీ నగర్ (235)కు గోలి వేణు గోపాల్ రెడ్డి, మయూరి నగర్ (242)కు సంగి కృష్ణ, భాగ్యనగర్ కాలనీ (244)కి జొన్నల నాగిరెడ్డి, షామ్స్‌గూడ (245)కు తాప్ప రఘు, ఆల్విన్ కాలనీ (246)కి చెల్లగొల్ల రాజు డివిజన్ అధ్యక్షులుగా నియమితులయ్యారు.
కొత్తగా నియమితులైన డివిజన్ అధ్యక్షులు తమ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు, స్థానికంగా బీజేపీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించే బాధ్యతలను చేపట్టనున్నారు. డివిజన్ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడంలో వీరి నియామకాలు కీలకంగా మారనున్నాయి.





