నల్లగండ్లలో GARAGE 9 సెంట‌ర్ ప్రారంభం

శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వాహనదారులకు అన్ని బ్రాండ్ల కార్లకు ఒకే చోట నాణ్యమైన ఆటోమొబైల్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన GARAGE 9 – మల్టీ బ్రాండ్ ఆటో సర్వీస్ సెంటర్ నల్లగండ్ల HUDAలో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరై సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ.. నమ్మకమైన, నాణ్యమైన సేవలు అందించడం ద్వారా GARAGE 9 వాహనదారుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. స్థానికంగా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు సంస్థ నిర్వాహకులను అభినందించారు. GARAGE 9 మరింత అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో GARAGE 9 నిర్వాహకులు విష్ణు వర్ధన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, మిద్దెల మల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here