కొండాపూర్‌లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్.. CR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య సేవలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్‌లో ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో CR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఆశావహుడు ఎండీ అలావుద్దీన్ పటేల్, CR ఫౌండేషన్, IDPD తెలంగాణ, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మావెరిక్స్ సంయుక్తంగా నిర్వహించాయి.

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న CR పాలీక్లినిక్ లో జరిగిన ఈ వైద్య శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య సలహాలతోపాటు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలను అందించారు. నిపుణులైన వైద్యులు ఆరోగ్య సమస్యలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మెగా మెడికల్ క్యాంప్‌ను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here