గంగారం సుభాష్ నగర్‌లో స‌ర్ ఓటరు ధ్రువీకరణ

శేరిలింగంపల్లి, జూలై 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గంగారం సుభాష్ నగర్ కాలనీలో స‌ర్ (SIR) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ నంబర్లు 107, 108 పరిధిలో వార్డ్ సభ్యుడు దొంతి శేఖర్ ముదిరాజ్ బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాల ధ్రువీకరణ చేపట్టారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలను పరిశీలిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు స‌ర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here