నూత‌న‌ సీఐ శ్రీధర్ కు కాంగ్రెస్ నేతల ఘన సన్మానం

శేరిలింగంపల్లి, జూలై 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన ఎ. శ్రీధర్ కుమార్ ను శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు దొంతి కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన సీఐ ఎ. శ్రీధర్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. చందానగర్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం ఆయన చేపట్టే సేవలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గుండోజు శ్రీనివాస్ చారి, దొంతి దీపక్ గౌడ్, దొంతి దినేష్ గౌడ్, విఘ్నేష్, శివకుమార్ దొరై తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here