శేరిలింగంపల్లి, జూలై 27 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిల మాతృమూర్తి పట్నం రుక్కమ్మ ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్, శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు కొమిరిశెట్టి సాయిబాబా సోమవారం పట్నం మహేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన సాయిబాబా, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. శోకసంద్రంలో ఉన్న పట్నం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






