శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ మియాపూర్–మక్తా డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రగతి ఎన్క్లేవ్, ఆర్బీఆర్, జనప్రియ వెస్ట్ సిటీ, ప్రజయ షెల్టర్స్, బీకే ఎన్క్లేవ్, మక్తా, జేపీ నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బీఎల్ఓలు, బీఎల్ఏలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులతో కలిసి SIR కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. స్థానిక ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని ఓటరు నమోదు, ధ్రువీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి పౌరుడు తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదైందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా భాగస్వామి కావాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్యూమరేషన్ ఫామ్‌ను ఆన్లైన్లో కూడా సులభంగా సమర్పించవచ్చని ప్రజలకు వివరించిన ఆయన, ఫామ్ పూరించే విధానం, నమోదు, ధ్రువీకరణ ప్రక్రియపై దశలవారీగా అవగాహన కల్పించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు పూర్తి చేసుకునేలా అవసరమైన మార్గనిర్దేశం, సహకారం అందించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని బీఎల్ఓలకు సూచించారు. ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని తమ వివరాలను సరిచూసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య హక్కును మరింత బలోపేతం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రావిపాటి వెంకటేశ్వరరావు, శంకర్ చారి, మహేశ్వర్, గోవర్ధన్, ఐన రెడ్డి, శ్రీకాంత్, సదానందం, గోపాల కృష్ణ, విజయలక్ష్మి, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, శరత్, మధు, రాధాకృష్ణ, సతీష్, ప్రవీణ్, వంశీ, రత్నాచారి, రామ్, శశి, పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.





