శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్‌కు నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్‌ను రంగారెడ్డి జిల్లా టీపీసీసీ కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కట్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా స్నేహపూర్వక పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తూ విజయవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రజల సహకారంతో చందానగర్ ప్రాంతాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు చేపట్టే ప్రతి మంచి కార్యక్రమానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, నర్సింగ్ పాల్గొని నూతన సీఐ శ్రీధర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.






