మియాపూర్‌లో SIR సమీక్ష సమావేశం.. బీఎల్‌ఏలకు కీలక ఆదేశాలు

శేరిలింగంప‌ల్లి, జూలై 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ సర్కిల్ పరిధిలోని బూత్ లెవల్ అసిస్టెంట్లు (BLAs)తో డిప్యూటీ కమిషనర్, మియాపూర్ సర్కిల్ (AERO/DC) ఛాంబర్‌లో బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిని అధికారులు సమీక్షించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, విజయవంతంగా అమలు చేయడంలో పూర్తి సహకారం అందించాలని బీఎల్‌ఏలను AERO/DC కోరారు. అలాగే కార్యక్రమం అమలులో పాటించాల్సిన విధివిధానాలు, కార్యాచరణపై బీఎల్‌ఏలకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను అధికారులు వివరించారు. SIR ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఓటరుకి సేవలు అందేలా కృషి చేయాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here