శేరిలింగంపల్లి, జూలై 13 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. యూబీడీ విభాగానికి మాత్రమే ఒక ఫిర్యాదు అందగా, ఇతర విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.






