ప్ర‌తి ఒక్క‌రు ఓటు హక్కు వినియోగించుకోవాలి: బాలింగ్ గౌతమ్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, జూలై 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్టుమెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రత్యేక ఓటరు నమోదు (SIR)తో పాటు ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ప్రతి యువతీ, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, అలాగే ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్న ఆయన, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియ, జాబితాలో పేర్ల సవరణ, కొత్తగా నమోదు చేసుకునే విధానంపై అపార్టుమెంట్స్ నివాసితులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక నివాసితులు, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here