శేరిలింగంపల్లి, జూలై 13 (నమస్తే శేరిలింగంపల్లి): నిర్వహణ పనుల దృష్ట్యా మంగళవారం (జూలై 14, 2026) మియాపూర్ విద్యుత్ విభాగం పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మయూరి నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ సాయినాథ్ నగర్ ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో సాయినాథ్ నగర్, ప్రశాంత్ నగర్, ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2, సెట్‌విన్ కాలనీ ప్రాంతాలు ప్రభావితమవుతాయి.
అలాగే మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మయూరి నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ రామ్ నరేష్ నగర్ ఓహెచ్ ఫీడర్ నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ సమయంలో మిత్రా హిల్స్, ప్రశాంత్ నగర్, ఏఎస్ రాజు నగర్, ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుంది. వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని విద్యుత్ అంతరాయానికి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.





