తెలంగాణ రక్షణ సేనలో 100 మందికి పైగా చేరికలు

శేరిలింగంప‌ల్లి, జూలై 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ బలోపేతానికి ఊతమిస్తూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. మక్తా మహబూబ్‌పేట్ డివిజన్‌కు చెందిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమం బంజారాహిల్స్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. పార్టీ నాయకురాలు కవిత సమక్షంలో దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేనలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో గుండె దయానంద్ ముదిరాజ్, గుండె లక్ష్మి ముదిరాజ్, గోపాల్ ముదిరాజ్, ప్రభు ముదిరాజ్, ప్రభాకర్, స్వామీగౌడ్, ఘాపూర్, సయ్యద్, అక్బర్, అలీ, రాజు, అస్లాం, ప్రశాంత్, సువర్ణ ముదిరాజ్, పుష్పమ్మ, లక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో పార్టీ సిద్ధాంతాలు, పాంచజన్యం భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తెలంగాణ రక్షణ సేనను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, కిషోర్, లావణ్య బండారి, సందీప్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here