శేరిలింగంపల్లి, జూలై 11 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్, మదీనగూడ డివిజన్ల పరిధిలో శనివారం ప్రత్యేక ఓటరు నమోదు (ఎస్ఐఆర్) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంగారం బస్తీ దవాఖానా, హుడా కాలనీ, ఇంజనీర్స్ ఎన్క్లేవ్, మదీనగూడ గ్రామం, ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ, జనప్రియ నగర్ ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓటర్లకు, బూత్ స్థాయి అధికారులకు (బీఎల్వోలు) ఓటరు నమోదు, ఓటరు జాబితా పరిశీలనపై అవగాహన కల్పించారు. అర్హులైన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని బాలింగ్ గౌతమ్ గౌడ్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జమీర్ (లిమ్ర), మనోహర్ గౌడ్, మల్లేష్ గౌడ్, రాజు, శ్రావణ్, వీరేందర్, గోపి, రాము, జహీర్, సాదిక్, మతిన్, ఆశ, కల్యాణి పాల్గొన్నారు.





