శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు సూచనల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని మాధవరం నగర్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు సర్వే ఫారాలు పంపిణీ చేయడం, వాటిని సక్రమంగా నింపే విధానంపై అవగాహన కల్పించారు. ఫారాల నింపడంలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేందుకు పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

అనంతరం మాధవరం రంగారావు మాట్లాడుతూ ఈ నెల 23న మియాపూర్ నరేన్ గార్డెన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు చేసిన ప్రసంగం వీడియోను వీక్షించిన అనంతరం, బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు)తోపాటు బీఎల్ఏలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు సర్వే ఫారాలు అందజేయాలని అన్నారు. ఫారాలను ఎలా నింపాలో పూర్తి వివరాలను తెలియజేసి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాచర్ల భద్రయ్య, ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





