శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): ఆదివారం కేటీఆర్ కన్నెపల్లి పర్యటన సందర్భంగా ఛాతికి బలమైన గాయం అయినట్లు తెలిసిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును ఆయన నివాసంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పరామర్శించారు. ఈ సందర్భంగా శంబీపూర్ రాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సాయిబాబా, ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుతున్నానని అన్నారు.






