ఓట‌రు జాబితాలో ప్ర‌తి పౌరుడు వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాలి: రాగం హరి శంకర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూలై 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్ల డివిజన్ పరిధిలోని డైమండ్ హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మంజీరా డైమండ్ టవర్స్ ప్రాంతాల్లో నల్లగండ్ల డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాగం హరి శంకర్ యాదవ్ BLOలతో కలిసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితాను పరిశీలించి, దరఖాస్తు ఫారాలను సేకరించారు.అనంతరం BLOలు, BLAలతో కలిసి ఓటర్లకు ఫారాలను అందజేస్తూ, కొత్త ఓటరు నమోదు, పేరు, చిరునామా, ఇతర వివరాల సవరణలకు సంబంధించిన దరఖాస్తులను ఎలా పూరించాలో ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రతి అర్హుడైన పౌరుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో భాగంగా తమ వివరాలను ఓటరు జాబితాలో తప్పనిసరిగా పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని రాగం హరి శంకర్ యాదవ్ సూచించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శంకరి రాజు ముదిరాజ్, డైమండ్ హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (DHWA) అధ్యక్షుడు గంగావల్లి వంశీ, సెక్రటరీ ఎన్. దినేష్, ట్రెజరీ డి. రవిచందర్, మంజీరా డైమండ్ టవర్స్ వైస్ ప్రెసిడెంట్ అనుశుమన్ మిశ్రా, ఎంసీ మెంబర్ జ్ఞానేశ్వర్, కృష్ణారావు, మహేందర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here