శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీ నూతన కమిటీ సభ్యులు బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కాలనీ సమస్యలను వివరించారు. హఫీజ్‌పేటలోని ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సదుపాయం, కాంపౌండ్ వాల్ నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. కాలనీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరగా, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తనవంతు సహకారం అందిస్తానని అనూష మహేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షుడు మహేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సలహాదారు వంశీ, ఉపాధ్యక్షురాలు చంద్రకళ, జాయింట్ సెక్రటరీ బి.రాజు, ఖజాంచి ఆనంద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేవరాజ్, కమ్యూనిటీ సభ్యులు శ్రీదేవి, ప్రమీల, లావణ్య, అనిల్, వెంకటేష్, కృష్ణ నాయక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాలనీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కమిటీ సభ్యులంతా సమిష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.






