శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఘట్టమిదని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిత్వ శాఖల పనితీరు గ్రేడింగ్ వ్యవస్థలో, కేంద్ర బొగ్గు గనుల శాఖ దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషమన్నారు. ఈ శాఖకు నాయకత్వం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిపాలనా దక్షత, పారదర్శకత, ప్రజాసేవ పట్ల నిబద్ధతకు ఇది నిదర్శనమని కొనియాడారు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి దేశ స్థాయి నాయకుడిగా ఎదిగిన కిషన్ రెడ్డి ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. నిరంతర శ్రమ, అవినీతి రహిత పాలన, ఫలితాల ఆధారిత పరిపాలనతో ఆయన ప్రత్యేక గుర్తింపు సాధించారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచిన కిషన్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు నందకుమార్ యాదవ్ తెలిపారు.






