శేరిలింగంపల్లి, ఏప్రిల్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ మహాత్మా బసవేశ్వర 893వ జయంతి సందర్భంగా హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో నిర్వహించిన బసవేశ్వర జయంతి వేడుకలలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి, 200 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ విద్య, సమాజం, సమానత్వం గురించి పోరాటం చేసిన మహనీయుడు బసవేశ్వరుడు అని అన్నారు. స్త్రీ, పురుష అసమానతలు తొలగించడానికి కృషి చేసిన అభ్యుదయవాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మల్లికార్జున్ శర్మ , బుచ్చిరెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






