దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి అంబేద్కర్: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అంబేద్కర్ కేవలం ఒక కులానికో, వర్గానికో పరిమితమైన నాయకుడు కాద‌ని, ఆయన దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి అని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి , శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. శుక్ర‌వారం మియాపూర్ బస్ డిపో 2 వద్ద ఆర్‌టీసీ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన డా బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు డా. బి.ఆర్.అంబేద్కర్ అని అన్నారు. డా. బి.ఆర్ అంబేద్క‌ర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గర్వకారణమన్నారు. అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాద‌ని, ఒక సిద్ధాంతమని, ఆయన మనకు సమానత్వం, విద్య, స్వాభిమానం అనే విలువలను అందించిన మహనీయుడని అన్నారు. శిక్షణ పొందండి, పోరాడండి, సంఘటితమవండి అనే ఆయన సందేశం నేటికీ ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని అన్నారు. 2018 లో ఆగిపోయిన విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు పూర్తి కావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కాంతి కిరణ్, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు కాంచన కృష్ణ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్ ఫౌండర్ థామస్, యూనియన్ సెక్రటరీ యాదయ్య, విజిలెన్స్ ఆఫీసర్ మహంకాళి, డిపో మేనేజర్ వెంకటేష్, డిపో సెక్రటరీ లక్ష్మయ్య , ఎస్సీ మోర్చ రాష్ట్ర నాయకుడు నాగరాజు, జిల్లా కార్యదర్శి మాణిక్ రావు, సీనియర్ నాయకులు నాగేశ్వర్ గౌడ్, మహేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్, వేణు గోపాల్ యాదవ్, గణేష్, విజయేందర్, పద్మ, శ్రీనివాస్ యాదవ్, జె.శ్రీనివాస్, సురేష్, రాము, శ్రీనివాస్, చందు, ఆంజనేయులు, పట్టాభిరామ్, బాషా, శివ‌, మన్యం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here