సత్య ఎన్‌క్లేవ్‌లో సీసీ రోడ్డు పనుల పరిశీల‌న

శేరిలింగంప‌ల్లి, మార్చి 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని సత్య ఎన్‌క్లేవ్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ Ghmc అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా రోడ్ల నిర్మాణం ఉండాలని మాజీ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని, నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. కాలనీవాసులు సీసీ రోడ్డు పనులు ప్రారంభమైనందుకు సంతోషం వ్యక్తం చేసి మంజుల రఘునాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here