శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో నల్లగండ్ల స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రన్ ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నల్లగండ్ల స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించడం చాలా అభినందనీయం అని అన్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రగడ సత్యనారాయణ, నల్లగండ్ల స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంత్రిప్రగడ శాలి మిత్ర, వైస్ ప్రెసిడెంట్ నరేశ్, ప్రతాప్, ప్రభాకర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి , సురేష్ నాయక్, కిరణ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






