వడ్డే ఓబన్న త్యాగాలను స్మరించుకోవాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న 219 వ జయంతి సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ నగర్ లో జరిగిన కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు వడ్డే ఓబన్న అని అన్నారు. దేశం కోసం పోరాడిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నెముకలా నిలిచారని, ఆయన సాగించిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమ‌ని అన్నారు. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని త్యాగాలను స్మరించుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here