శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని హఫీజ్‌పేట డివిజన్ ప్రజయ్ సిటీ అపార్ట్‌మెంట్స్‌లో సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలకు ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ సతీమణి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజయ్ సిటీ దేవాలయాల కమిటీ ప్రెసిడెంట్ శివనాగ మణి నాయుడు, కాలనీ సెంట్రల్ ప్రెసిడెంట్ నాయుడు, రామకృష్ణ, రామేశ్వర్ రెడ్డి, సంపత్, విజయ్, రాజు, స్వామి, సురేష్, నాగేశ్వర్ రావు, సాయిబాబా, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల విజేతలకు లక్ష్మి బహుమతులను అందజేశారు.






