శేరిలింగంపల్లి, జనవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, హఫీజ్ పేట్ డివిజన్ బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో హఫీజ్ పేట లో సగర సంఘం బిల్డింగ్ నిర్మాణానికి MLA ఆరెక పూడి గాంధీని కలిసి సగర సంఘం భవన నిర్మాణ అంశం పై చర్చించారు. దీని పై సానుకూలంగా స్పదించిన ఎమ్మెల్యే గాంధీ భవన నిర్మాణానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సగర సంఘం అభివృద్ధికి అండగా ఉంటానని భరోసా కల్పించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ, ఈ విషయంలో చొరవ తీసుకున్న గౌతమ్ గౌడ్ కి సగర సంఘం ప్రెసిడెంట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం ప్రతినిధులు అధ్యక్షుడు వెంకట్ రాములు, విజయ్ సాగర్, భీమ్, నరసింహ, శివ, మూర్తి, మారుతి, ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.






