వేమన కాలనీ లో సెమీక్రిస్మ‌స్ వేడుకలు

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన కాలనీ లో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీక్రిస్మ‌స్ వేడుకలలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, పాస్టర్ల తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మ‌స్ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. మీ అందరి మధ్యలో కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంద‌ని తెలిపారు. శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణ లతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవుల‌కు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here