శేరిలింగంపల్లి, డిసెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని మసీదు బండ మెయిన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వరం ఆర్గానిక్ స్టోర్ ను కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తుల వినియోగం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని, గ్రామీణ రైతులు ఉత్పత్తి చేసే ఆర్గానిక్ ఆహార పదార్థాలు ప్రస్తుతం మారుతున్న మోడ్రన్ ఫుడ్ కంటే ఎంతో మెరుగైనవని అన్నారు. నిర్వాహకుడు మురళి, ఆయన కుటుంబ సభ్యులను ఆర్గానిక్ స్టోర్ ను ఏర్పాటు చేసినందుకు అభినందించారు. వినియోగదారులకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించే దిశగా, సేంద్రియ వ్యవసాయం, చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యత పాటిస్తూ సరసమైన ధరలకు సరుకులను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు మురళి, సంతోష్ రెడ్డి, పవిత్ర లక్ష్మి, నారాయణ, దీపక్, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






