ఆదర్శ్ నగర్ కాలనీ అభివృద్ధికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.10 లక్షల అంచనా వ్యయంతో SDF FUNDS నిధులతో నిర్మించడానికి గాను నిధుల మంజూరు కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి పంపిన మంజూరు పత్రాలను ఆదర్శ్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఆదర్శ్ నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయవలసిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ప్రతిపాదనలు పంపడం జరిగింద‌ని , నిధులు మంజూరు కాగానే కమ్యూనిటీ హాల్ ను త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. చిన్న చిన్న సమావేశాలు, సభలు, ఫంక్షన్ లు నిర్వహించుకునేందుకు వీలుగా కమ్యూనిటీ హాల్ ను నిర్మించుకోవ‌డం సంతోషంగా ఉందన్నారు. ఆదర్శ్ నగర్ కాలనీ అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని, మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, G. V రావు, తంబీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here