శేరిలింగంపల్లి, డిసెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఉత్సవాలు జరపడం సబబు కాదని, 6 గ్యారంటీలు, 66 హామీలలో ఎన్ని నెరవేర్చారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల ప్రజా వంచక పాలనపై నిర్వహించబోయే మహాధర్నా కార్యక్రమానికి భారీసంఖ్యలో తరలివెళ్దామని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల ప్రజా వంచక పాలనపై నిరసనగా ఇందిరాపార్క్, ధర్నాచౌక్ వద్ద నిర్వహించబోయే మహాధర్నా కార్యక్రమానికి మసీద్ బండ బీజేపీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయిలోని ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి భారీసంఖ్యలో తరలివెళ్లి మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అరిగోసలు పడుతుంటే ప్రభుత్వం విజయోత్సవాలు, వారోత్సవాలు జరపడం సబబేనా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీ లు, 66 హామీలలో మీ ప్రభుత్వం ఎన్ని నెరవేర్చిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. రైతులకు అన్యాయం చేశారు, 42 శాతం రిజర్వేషన్లు అని బిసిలను వెన్నుపోటు పొడిచారు, లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డులు అని యువతకు, విద్యార్థులకు మొండిచేయి చూపించారని అన్నారు. నెలకు 2500, పెళ్ళికి లక్ష రూపాయల డబ్బు, తులం బంగారం అని మోసం చేశారన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన అంటే అమ్మకాలు, అప్పులు, వసూళ్లు, బెదిరింపులు, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు, వారోత్సవాలు జరపడం అని ప్రజలకు తెలియదనుకుంటున్నారేమో, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. గత పదేళ్ల బిఆర్ ఎస్ పాలనను ఎలా తరిమికొట్టారో మీ రెండేళ్ల పాలనలోనే ప్రజలు ఎప్పుడు ఎన్నికలొస్తే అప్పుడు తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
మీరు మొన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అధికారం, పోలీసులను ఉపయోగించి రిగ్గింగులు చేసి గెలిచేశాం అని సంబరాలు చేసుకుంటున్నారు. ఇక నుండి మీ ప్రభుత్వ ప్రజా వంచక పాలనపై నిరసనగళం విప్పుతూనే ఉంటాం. మీరిచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ గౌడ్, కార్యదర్శి మాణిక్ రావు, సీనియర్ నాయకులు వసంత్ యాదవ్, గోపాల్ రావు, డివిజన్ అధ్యక్షులు అరవింద్, శివాసింగ్, వేణుగోపాల్ రెడ్డి , ఆకుల లక్ష్మణ్, జితేందర్, శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ కుమార్, బాలు యాదవ్, డివిజన్ నాయకులు అజిత్, భూపాల్ రెడ్డి, సత్యనారాయణ రాజు, రమణయ్య, పట్టాభిరామ్, ప్రభాకర్, శ్రీను, శివరాజ్, విజయేందర్, మహిళా నాయకురాళ్ళు పద్మ, విజయ లక్ష్మీ, మేరీ, సరోజ, కవిత, ఆదిలక్ష్మి, రాణి, శ్రీనివాస్ యాదవ్, శివా యాదవ్, ఆనంద్, భాషా శివ, సామ్రాట్, సాయి పటేల్, వేణు, నాగులు పాల్గొన్నారు.





