శిల్పారామంలో ఆక‌ట్టుకుంటున్న మేళా.. అలరించిన నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు..

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్, డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్‌, గవర్నమెంట్ అఫ్ ఇండియా నిర్వహిస్తున్న గాంధీ శిల్పా బజార్ హస్తకళల మేళా సందర్శకులను ఆకట్టుకుంటోంది. కార్పెట్స్, ఖాదీ షర్ట్స్, కలంకారీ, గొల్లభామ, పోచంపల్లి, గద్వాల్, వెంకటగిరి చీరలు, మెటల్ క్రాఫ్ట్, లెద‌ర్ క్రాఫ్ట్, మధుబని పెయింటింగ్స్, బొబ్బిన్ లేస్ వర్క్స్ త‌దిత‌ర‌ రాష్ట్రాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. బుధ‌వారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ నటరాజ కూచిపూడి డాన్స్ అకాడమీ గురువు సుప్రియ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో జయము జయము, శ్రీ రంగనాథం, ముద్దుగారే యశోద, ఓం సర్వాణి, జయ జయ దుర్గే, అన్నమాచార్య కీర్తనలు, శ్యామల మీనాక్షి, సీత కళ్యాణం అంశాలను చైత్ర, రూప, హరిణి, రిషిత, సమీక్షిత, శ్రీనిక, ప్రణీత, దక్ష, యుక్తశ్రీ, మోక్షిత ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here