శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ లోని ఓల్డ్ హఫీజ్ పేట్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ MLA జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతం గౌడ్, బీజేపీ కాంటెస్ట్ కార్పొరేటర్ BLY మహేష్ యాదవ్, BRS అధ్యక్షుడు రామకృష్ణ పటేల్ గౌడ్, ఓల్డ్ హఫీజ్ పేట్ హనుమాన్ యూత్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ లీడర్ జమీర్, కనకమామిడి వెంకటేష్ గౌడ్, కనకమామిడి శ్రీనివాస్ గౌడ్, ధాత్రినాథ్ గౌడ్, మారబోయిన అనిల్ యాదవ్, సంజీవ్ రెడ్డి, యాదగిరి గౌడ్, తలారి బీమయ్య, తలారి రవి ముదిరాజ్, మంగలి అశోక్, MCPI నాయకులు మైదంశెట్టి రమేష్, పల్లె మురళీ గౌడ్, తుడం అనిల్, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.







