శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో భూమి కోసం చేసిన పోరాట ఉద్యమకారిణి, నేటి తరం యువతకు పోరాట పటిమకు దిక్సూచి చూపించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా హఫీజ్‌పేటలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






