శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు ప్రాంతాల్లో రహదారుల పక్కన వెలసిన అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. విశ్వనాథ గార్డెన్ నుంచి జేపీ నగర్ రోడ్డు వరకు రహదారుల పక్కన ఉన్న ఆక్రమణలను వారు తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకుంటామని తెలిపారు.






