జర్నలిస్ట్ కాలనీ ఫేజ్ 3 లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ ఫేజ్‌ 3 వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయ‌న‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కాలనీ ఫేజ్‌ 3 కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన UGD, మంచి నీటి వసతి, రోడ్లను పూర్తి చేయాలని, స్ట్రీట్ లైట్లు, ఐరన్ పోల్స్ స్థానంలో సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేయాల‌ని, పార్కుల అభివృద్ధితో చెత్తను తొలగించడంతోపాటు ప‌లు సమస్యలను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే జర్నలిస్ట్ కాలనీ ఫేజ్‌ 3 కాలనీలో పర్యటిస్తానని, UGD , రోడ్డు పనులను ప్రారంభిస్తామని, కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను నిర్మిస్తామ‌ని అన్నారు. అవసరమున్న చోట రోడ్లను, UGD పైప్ లైన్ లు ఏర్పాటు చేస్తామని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కాలనీ ఫేజ్ 3 మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు గోపరాజు , కమిటీ సభ్యులు భీమగాని మహేశ్వర్, డి కమలాకరాచార్య, కాలనీ డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ వేణుగోపాలరావు, సీనియర్ జర్నలిస్టులు ప్రభాకర్ రావు, హనుమంతరావు, సైదా రెడ్డి, పెద్దిరాజు, కాసుల ప్రతాపరెడ్డి, పద్మనాభ రెడ్డి, ఏవీ నరసింహారావు, దోర్బాల బాల శేఖర్ శర్మ, బాల మురళి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here