శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లిలోని బార్ అసోసియేషన్ కోర్టులో వినాయక చవితి సందర్భంగా మండపాన్ని ఏర్పాటు చేసి గణేశ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు భీమయ్య, సాంస్కృతిక కార్యదర్శి కమ్మెట సురేష్, మహిళా ప్రతినిధి బివిఎన్ఎల్ లత, సీనియర్ న్యాయవాదులు ఎన్.దర్మేష్, అనిల్ వైద్య, దయానంద్ పాటిల్, వి.కేశవ రావు, శ్రీనివాస్ సింగ్, ఖలీల్ పాషా, రాంబాబు, జ్యోత్స్న చౌదరి, పాండురంగ రావు, రవిశంకర్ రెడ్డి, ఎస్.కృష్ణ, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు.






