శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన C N G సబ్సిడీ ఆటోల స్కీం లో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని షంషీగూడ, శ్రీనగర్ కాలనీల కు చెందిన లబ్ధిదారులకు ఏడు ఆటోలను మంజూరు చేశారు. మంజూరైన ఆటోలను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన CNG సబ్సిడీ ఆటో ల స్కిమ్ కింద 7 మంది లబ్ధిదారులకు ఆటోలను అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. లబ్ధిదారులకు జీవనోపాధి లభిస్తుంది అని , వారి జీవితాల్లో వెలుగు నింపినట్లు ఉంటుంది అని అన్నారు. ఆటో లు బాగా నడుపుకొని జీవితంలో పైకి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారెళ్ళ శ్రీనివాసరావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పురెందర్ రెడ్డి, మల్లయ్య, పవన్ గౌడ్, కాజా, శ్రీనగర్ కాలనీ అధ్యక్షుడు వీరన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






