శేరిలింగంపల్లి సమగ్ర అభివృద్దే ధ్యేయం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో రూ. 3 కోట్ల 61 లక్షల అంచనా వ్యయంతో M-Gen(మల్టీ జనరేషన్) పార్క్ ప్రారంభోత్సవం, నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన , అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here