జెరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక‌లు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కేశవ్ నగర్ లోని పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి ఆయ‌న‌ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జెరిపేటి రామచంద్ర రాజు, రాజేంద్ర, కవి రాజ్, సూర్య రాథోడ్, మారెళ్ళ శ్రీనివాస్, రామచంద్ర, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here