హెచ్‌సీయూలో అమెనిటీస్ సెంటర్​ ప్రారంభం

గ‌చ్చిబౌలి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలిలోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో అమెనిటీస్ సెంటర్​ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా 100 శాతం అక్షరాస్యత సాధించలేక పోయామన్నారు. విద్య అనేది సామాజిక అసమానతలు తగ్గించి సంపూర్ణ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా సవాళ్లను అధిగమించేందుకు తోడ్పడుతుందని ఉప రాష్ట్రపతి స్పష్టం చేశారు. కేంద్రం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 21వ శతాబ్ధం సవాళ్లు అధిగమించేలా ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్​సీయూ ఉపకులపతి అప్పారావు, డీన్ నాగార్జున పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here