శేరిలింగంపల్లి, డిసెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ హుడా కాలనీకి చెందిన కరుణాకర్, ఆల్విన్ కాలనీ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఎల్లమ్మబండకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరు అయిన రూ.1.20 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు,డివిజన్ అధ్యక్షులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.