శేరిలింగంపల్లి, నవంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీలో ఉన్న సెయింట్ ఇసాక్ అడ్వెంట్ హై స్కూల్ లో సెయింట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లో PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సెయింట్ ఇసాక్ అడ్వెంట్ హై స్కూల్ లో సెయింట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను నిర్వహించడం చాలా అభినదించదగ్గ విషయం అని అన్నారు. కాలనీ వాసులకు, చుట్టుపక్కల పేద ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించడం చాలా శుభపరిణామం అని అన్నారు.
ఇక్కడ ఉచితంగా రక్త పరీక్షలు, జనరల్, దంత వైద్యం, బీపీ, షుగర్, గైనకాలజీ, ఆర్థో, ECG, ENT వంటి సేవలు ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగిందని,పేద ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవడం చాలా అభినందనీయమని, ఆరోగ్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సామాజిక దృక్పథంతో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించడం అభినందనీయమని, వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సెయింట్ ఇసాక్ అడ్వెంట్ హై స్కూల్ సెయింట్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ ఇసాక్ లజర్స్, ప్రిన్సిపాల్ కమర్ జాన్ ఇసాక్, అక్తర్, మహమ్మద్ బేగ్, ఆదిత్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రేసిడెంట్ మహమ్మద్ ఖాసీం, సర్ఫరాజ్ మోహినుదుద్దీన్, అమీర్, ఫజల్, షేక్ అస్లాం, రఫీక్, షబీర్ వైద్య సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.