శేరిలింగంపల్లి, నవంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ఎంఏ నగర్ పార్టీ ఆఫీస్ లో ఎంసీపీఐ (యు) మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7న జరిగే జాతీయ సెమినార్ కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( ఐక్య ) ఎంసీపీ (యు) – రివల్యూషనరి మార్క్ లిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ఎంపిఐ) ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ (సిసిసి ) సమావేశాలు నవంబర్ 5, 6, 7 తేదీలలో హైదరాబాద్ ఓంకార్ భవన్ బిఎన్ హాల్లో జరుగుతున్న సందర్భంగా అక్టోబర్ విప్లవ విశిష్టతను గుర్తు చేస్తూ నవంబర్ 7వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాగ్ లింగంపల్లిలో 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు – మతోన్మాద ఫాసిస్టు కార్పొరేట్ శక్తుల ప్రమాదం – వామపక్ష కమ్యూనిస్టుల శక్తుల కర్తవ్యం అనే అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సెమినార్ కు ప్రజలు ప్రజాస్వామ్యక వాదులు, విద్యార్థి, యువజన, మేథావులు అధిక సంఖ్యలో హాజరై, త్యాగాలకు, సమరశీల ఉద్యమాలకు ఆదర్శంగా బలోపేతం చేసేందుకు అందరూ భారీ ఎత్తున కదిలి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు జి.లలిత, జి.శివాని, ఎండి సుల్తానా బేగం, శంకర్, వి.అనిత, బి.అరుణ, కె.రాజు తదితరులు పాల్గొన్నారు.