పీఏసీ చైర్మ‌న్ గాంధీకి బాలింగ్ గౌత‌మ్ గౌడ్ శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): PAC చైర్మన్ గా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీకి హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు బాలింగ్ గౌత‌మ్ గౌడ్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. గాంధీని ఆయ‌న చాంబ‌ర్‌లో క‌లిసిన గౌత‌మ్ గౌడ్ పుష్ఫ గుచ్ఛం అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా గౌత‌మ్ గౌడ్ మాట్లాడుతూ గత దశాబ్దం కాలంగా తన నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నిలబెట్టిన నాయకుడు గాంధీ అని కొనియాడారు. పేదల కష్టాలు తెలిసిన నాయకుడిగా ఎదిగి వారి కష్టాల్లో భాగం అయ్యి వారికి అండగా నిలిచిన నాయకుడు గాంధీ అన్నారు. నూత‌నంగా చేప‌ట్టిన ప‌ద‌వి ద్వారా కూడా ఆయ‌న పేద‌ల‌కు సేవ చేస్తార‌ని ఆశిస్తున్నాన‌ని తెలిపారు.

Baling Gautham Goud wishes PAC Chairman Gandhi
గాంధీకి శుభాకాంక్ష‌లు తెలిపిన గౌత‌మ్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here