శేరిలింగంపల్లి, అక్టోబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిదేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం నియోజకవర్గం పరిధిలోని చందానగర్ మున్సిపల్ కార్యాలయంలో రూ.8 లక్షల రుణంతో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లను ఆయన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మియపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డిప్యూటీ కమీషనర్ మోహన్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ వత్సల దేవితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలను మంజూరు చేస్తున్నామని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తుందని తెలిపారు. అతివలకు అండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లపుడూ సహాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, మిరియాల రాఘవ రావు, మాజీ కౌన్సిలర్ రవీందర్, ఉరిటి వెంకట్ రావు, కట్ల శేఖర్ రెడ్డి, అక్తర్, హనీఫ్, వెంకటేష్, సుధాకర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.