శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. దేవీ నవరాత్రి వేడుకల్లో భాగంగా మూడవ రోజు అన్నపూర్ణ మాత అవతారంలో, విశేష అలంకరణలో పూజలు అందుకుంటున్న దుర్గాదేవి అమ్మవారిని, శేరిలింగంపల్లి డివిజన్ లోని శ్రీరామ్ నగర్ బ్లాక్ సి, తారానగర్ లలో పలు అమ్మవారి మండపాలను సందర్శించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ 3వ రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిచ్చారని తెలిపారు.
ఆ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సుఖసంతోషాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వీరేశం గౌడ్, గోపాల్ యాదవ్, తారానగర్ దుర్గా మాత ఉత్సవ కమిటీ రాంచందర్, భరత్, సాయి, శాంతి భూషణ్, నగేష్ రెడ్డి, రంగనాథ్, అజయ్ పాల్గొన్నారు. శ్రీరామ్ నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ గౌడ్, జనరల్ సెక్రటరీ రాజేందర్ గుప్తా, గౌరవ సలహాదారు నర్సింహా చార్యులు, టెంపుల్ ప్రెసిడెంట్ విజయ్ రెడ్డి, రంజిత్ సాగర్, బాలగౌడ్, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.