న‌ల్ల‌గండ్ల చెరువు కోనేరును శుభ్రం చేయాలి: మ‌ట్టా సురేష్ గౌడ్

గ‌చ్చిబౌలి‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని న‌ల్ల‌గండ్ల చెరువు కోనేరును వెంట‌నే శుభ్రం చేయాల‌ని డివిజ‌న్ బీజేపీ నాయ‌కుడు మ‌ట్టా సురేష్ గౌడ్ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్ కు ఫిర్యాదు చేశారు. వినాయ‌క చ‌వితి, బ‌తుక‌మ్మ ఉత్స‌వాల నేప‌థ్యంలో రూపొందించిన నల్లంగండ్ల చెరువు కోనేరు వ‌ద్ద పూర్తిగా అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం నెల‌కొంద‌న్నారు. ఇటీవల ఉత్సవాల నేపథ్యంలో కాంట్రాక్ట‌ర్ డ‌బ్బులు తీసుకున్నా కోనేరు ప‌రిస‌రాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు శుభ్రం చేయ‌లేద‌ని, నిమ‌జ్జ‌నాలు చేసే కొల‌నులో నీరు దుర్గంధంగా మారిందన్నారు. అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం వ‌ల్ల దోమ‌లు వృద్ధి చెందుతున్నాయ‌ని, ప్ర‌జ‌లు తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. క‌నుక వెంట‌నే చెరువు ప‌రిస‌రాలను శుభ్రం చేయాల‌ని పేర్కొన్నారు.

చెరువు వద్ద ప‌రిస‌రాలు చెత్త చెదారంతో ద‌ర్శ‌న‌మిస్తున్న దృశ్యం
చెరువు వద్ద ప‌రిస‌రాలు చెత్త చెదారంతో ద‌ర్శ‌న‌మిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here