నేతాజీన‌గ‌ర్‌లో రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌త్తులు

గ‌చ్చిబౌలి‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని నేతాజీ నగర్ లో స్థానిక కాల‌నీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ త‌న సొంత ఖ‌ర్చుల‌తో రహదారుల‌కు మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు రోడ్లు ధ్వంస‌మై అస్తవ్యస్తంగా మారిపోయాయి. దీంతో కాలనీ ప్రజల‌కు తీవ్ర ఇబ్బందులు క‌లుగుతున్నాయి. ఈ క్ర‌మంలో స్పందించిన భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్ త‌న సొంత ఖ‌ర్చుల‌తో ట్రాక్ట‌ర్ల‌తో మ‌ట్టి తెచ్చి ర‌హ‌దారుల‌పై ఏర్ప‌డ్డ గుంత‌ల‌ను పూడ్పింప‌జేయిస్తున్నారు. ఈ కార్యక్ర‌మంలో రాంబాబు నాయక్, తిరుపతయ్య, బాలరాజ్, సత్యమ్మ, పద్మమ్మ, శారద పాల్గొన్నారు.

ట్రాక్ట‌ర్‌తో మ‌ట్టిని త‌ర‌లిస్తున్న దృశ్యం
ర‌హ‌దారుల‌కు మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు చేయిస్తున్న భేరి రామచందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here