శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఎక్కడ చూసినా గణపతి నిమజ్జన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. లడ్డూ వేలం పాటలతో వినాయక మండపాలు కోలాహలంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నియోజకవర్గం పరిధిలోని అన్ని చెరువులు, కుంటల వద్ద నిమజ్జనోత్సవాల సందడి నెలకొంది.
రూ.70వేలకు నవయుగ యూత్ గణేషుడి లడ్డూ..
గోపీనగర్‌లో స్థానిక నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్ద నిర్వహించిన వేలం పాటలో చింతకింది సత్యనారాయణ గౌడ్ పాల్గొని గణేషుడి లడ్డూను రూ.70వేలకు పాడి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేషుడి లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భక్తులపై వినాయకుడి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.