శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని ఆదర్శనగర్ రోడ్డు నంబర్ 2 లోని ఎస్పీ రెసిడెన్సిలో ప్రతిష్టించిన వినాయకుడి లడ్డూను వేలం పాటలో రూ.5.51లక్షలకు చింతకింది మీనా మహేందర్ గౌడ్ కైవసం చేసుకున్నారు. వేలం పాటలో చింతకింది అమృత డాకయ్య గౌడ్ కుమారుడు మహేందర్ గౌడ్ లడ్డూను దక్కించుకున్నారు. గణేషుడి నవరాత్రి ఉత్సవాలలోభాగంగా
తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో, భజనలతో, నిత్యాన్నదానాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా గణేషుడు పూజలందుకున్నాడు. కాగా ఎస్పీ రెసిడెన్సీ గణనాథుడి లడ్డూను చింతకింది దంపతులు కైవసం చేసుకోవడం వరుసగా ఇది మూడోవసారి కావడం విశేషం.
గతేడాది 2023లో రూ.1.53 లక్షలకు, 2022లో రూ.2.21 లక్షలకు వేలం పాటలో చింతకింది మీనా మహెందర్ గౌడ్ దంపతులు గణేష్ లడ్డూలను దక్కించుకున్నారు .వరుసగా మూడో సారి హ్యాట్రిక్ గా లడ్డూ తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని చింతకింది మహేందర్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. వేలం పాటలో లడ్డూ కైవసం చేసుకోవడానికి పలువురు పోటీ పడినప్పటికీ చివరికి మహేందర్ గౌడ్ కే గణేషుడి మహాప్రసాదమైన లడ్డూ దక్కింది. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు బెజగం కేశవులు, మరాటి నర్సింహులు, గంగాధర సంతోష్, వేణుగోపాలచారి, శ్రావణ్ చారి,బాలాజీ, రత్నాకర్ రెడ్డి, జనార్ధన్, రాజశేఖర్ రెడ్డి, అంశపాల్ రెడ్డి, లింగారెడ్డి, విజయలక్ష్మి, బాలమణి, నిర్మల, అపార్టుమెంటు వాసులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.